ఇంకొన్ని జోకులు
వీరిచే పోస్ట్ చేయబడింది JV , 20, డిసెంబర్ 2010, సోమవారం 4:21 AM
బాక్సింగ్
"ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి" అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి.
"మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు పక్కనున్న వ్యక్తి.
"కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని" చెప్పాడు దంతనాధం
అదీ సంగతి!
అప్పారావు: ఈ పుస్తకంలో పాత్రల్ని పరిచయం చేసేసరికే సరిపోయింది . అసలు కథే లేదు! మరో పుస్తకమేదైనా ఇవ్వండి.
లైబ్రేరియన్: అదా సంగతి! టెలిఫోన్ డైరెక్టరీ ఎక్కడ పోయిందా అని తెగ వెతుకుతున్నా!
కోపం
అప్పారావు :డాక్టర్! ఈ మధ్య ప్రతి చిన్న విషయానికీ కోపం వచ్చేస్తోందండీ..........
డాక్టర్: ఏంటీ.........మళ్లీ చెప్పు?
అప్పారావు: ఎన్ని సార్లు చెప్పాలి నీ యబ్బ ........ఓ సారి చెబితే అర్థంకాదా? మనిషివా? పందివా ?
ఆ రెండు!
నాన్నా: ఏరా లెక్కల్లో మార్కులు వందకు ఫైనే వచ్చాయన్నావు? మరి రెండు మార్కులు వచ్చాయి ఏంటిరా?
చింటు : అవును నాన్నా! ఆ రెండు ఎక్కడ వేశారో చూడు. వందకు ఫైనే కదా!
ఇంగ్లీష్
బాబూ ఏది నీ నోరు చూపించు, అ, ఆ.. అను" అన్నాడు డాక్టర్ రాముతో.
పక్కనే ఉన్న రాము తండ్రి "మా వాడు english medium అండీ అ, ఆలు రావు" అన్నాడు డాక్టర్‍తో

కామెంట్‌ను పోస్ట్ చేయండి