రాకెట్
వీరిచే పోస్ట్ చేయబడింది JV , 19, ఏప్రిల్ 2010, సోమవారం 6:40 AM
టీచర్: నరేష్ ! చంద్రుడి మీదకి రాకెట్ పంపాలంటే ఎం చెయ్యాలి ?
నరేష్ : ముందు రాకెట్ తయారు చెయ్యాలి .
టీచర్ : నరేష్ ....పెళ్లి భోజనాలకి అరిటకులే ఎందుకు వాడతారు ?
నరేష్ : తమలపాకులితే చిన్నవి అవుతాయి కదా టీచర్
టీచర్: !!!!!!!!!!!!!
టీచర్ : నరేష్ ..! " ఆశ్చర్యపోవటం" దీనిని సొంత వాక్యం లో ఉపయోగించు .
నరేష్ : బాలకృష్ణ సినిమా హిట్ అని పుకారు రావటం తో మేమంతా ఆశ్చర్యపోయాము
టీచర్: గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలంటే ఎం చెయ్యాలి నరేష్?
నరేష్ : "నిచ్చెన కొని తెచ్చుకోవాలి టీచర్ " చెప్పాడు అమాయకంగా
టీచర్: ?????????????????
టీచర్: కృష్ణుడు నల్లగా ఎందుకుంటాడు నరేష్?
నరేష్ : చిన్నపుడు ఎండలో ఎక్కువ తిరిగుంటాడు టీచర్!!
అవాక్కయ్యింది టీచర్??????????

కామెంట్‌ను పోస్ట్ చేయండి